Adarsha Kutumbam: దసరా నుంచి తప్పుకున్న 'ఆదర్శ కుటుంబం'.. మరి రిలీజ్ ఎప్పుడంటే.?
Adarsha Kutumbam: వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది.
Adarsha Kutumbam: దసరా నుంచి తప్పుకున్న 'ఆదర్శ కుటుంబం'.. మరి రిలీజ్ ఎప్పుడంటే.?
Adarsha Kutumbam: ప్రముఖ హీరోల సినిమాలు పండుగ సీజన్లలో విడుదల కావడం సాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా దసరా లేదా దీపావళి వంటి ప్రత్యేక పండుగలలో బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రచారంలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9కి సినిమా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాపరిణామాల ప్రకారం ఆ తేదీకి కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని సినీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. దసరా బరి నుంచి ఈ చిత్రం పూర్తిగా తప్పుకున్నట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం అలాగే లాస్ట్ మినిట్‌లో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్ణయించడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే సరైన సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాకపోవడం పట్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమాను అక్టోబర్ 30కి వాయిదా వేసినట్లు మేకర్స్ అనధికారికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ వాయిదా నిర్ణయం వల్ల బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. పండుగ సీజన్‌ను మిస్ అయినప్పటికీ సినిమాను మరింత మెరుగైన అవుట్‌పుట్‌తో తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




