Nana Patekar: రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. మరణానికి ముందే నానా పటేకర్ చెప్పిన ఆఖరి మాటలు వైరల్!

Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించడానికి మూడు రోజుల ముందు గోవాలో మాట్లాడిన చివరి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 8 Oct 2026 12:33 PM IST
Nana Patekar: రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. మరణానికి ముందే నానా పటేకర్ చెప్పిన ఆఖరి మాటలు వైరల్!
X

Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్‌ హఠాన్మరణం భారతీయ సినీ పరిశ్రమను, కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన కన్నుమూయడానికి కేవలం మూడు రోజుల ముందు 'మరణం' గురించి, జీవితం గురించి మాట్లాడిన ఆఖరి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాలు తీవ్రంగా కలచిపోతున్నాయి.

అక్టోబర్ 4న గోవాలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో నానా పటేకర్ పాల్గొని మాట్లాడారు. ఆ ఈవెంట్‌లో ఆయన జీవిత సత్యాల గురించి ప్రస్తావిస్తూ..“మనందరం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే. రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ సమయం కచ్చితంగా వస్తుంది. కానీ ఆ రోజు రాకముందే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి.. ‘నేను చేయాలనుకున్నది చేయగలిగానా? నా లక్ష్యం దిశగా సరైన ప్రయత్నం చేశానా?’ అనేది ఎప్పుడూ పరిశీలించుకోవాలి” అని నానాజీ పేర్కొన్నారు. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లేలోపు జీవితమంతా ఏదో ఒక మంచి సాధించాలనే తపనతో ప్రతి క్షణం బ్రతకాలని ఆయన ఆ సంభాషణలో హితవు పలికారు.

ఇలా మరణం గురించి, మానవ జీవితం నశ్వరమని చెప్పిన సరిగ్గా మూడు రోజులకే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడవడం అభిమానులను, సినీ ప్రముఖులను మరింతగా కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నెటిజన్లు ఆ చివరి మాటలను షేర్ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.