Imran Khan: నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. అక్టోబర్ 28లోగా భారత్‌ విడిచి వెళ్లాలని పోలీసుల ఆదేశం!

Imran Khan: సీజేపీ నిరసనల్లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసుల నోటీసులు. అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం, భాజపా నేత ఫిర్యాదుతో చర్యలు.

Arun Chilukuri
Published on: 15 Oct 2026 11:58 AM IST
Imran Khan
X

Imran Khan: నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. అక్టోబర్ 28లోగా భారత్‌ విడిచి వెళ్లాలని పోలీసుల ఆదేశం!

Imran Khan: బాలీవుడ్ నటుడు, ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న ఆయన, అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల ముంబయిలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడమే ఈ తాజా పరిణామానికి ప్రధాన కారణం కావడం గమనార్హం.

ఇటీవల ముంబయిలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆందోళనల సమయంలో ఆయన్ని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టారు.

మ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, విదేశీ పౌరుడై ఉండి భారత్‌లో రాజకీయ, నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (OCI) లేదా వీసా నిబంధనలను ఇమ్రాన్ ఖాన్ ఉల్లంఘించారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కిరీట్ సోమయ్య డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన ముంబయి పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసి, నిర్దిష్ట గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.