పెళ్లికి రెడీ అయిన 'మిస్టర్ పర్ఫెక్ట్'.. అదిరిపోయే క్రేజీ అప్‌డేట్!

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.

Srinivas Rao
Published on: 22 Jun 2026 3:08 PM IST
Aamir Khan
X

పెళ్లికి రెడీ అయిన 'మిస్టర్ పర్ఫెక్ట్'.. అదిరిపోయే క్రేజీ అప్‌డేట్!

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడనున్నట్లు ఆమిర్ అధికారికంగా ధృవీకరించారు. జూలై 5, 2026న వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకను చాలా నిరాడంబరంగా, కేవలం కుటుంబ సభ్యులు , అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్‌గా నిర్వహించనున్నట్లు ఆమిర్ పేర్కొన్నారు.

అతి తక్కువ మంది సమక్షంలో..

ఈ వివాహ వేడుక గురించి మాట్లాడుతూ, ఆమిర్ తన ఆలోచనలను పంచుకున్నారు. "ఇది చాలా సాధారణమైన రిజిస్టర్డ్ వివాహం. కేవలం మా కుటుంబ సభ్యులు , చాలా దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరవుతారు. మేము ఇద్దరం కలిసి ఈ వేడుకను చాలా బేసిక్ , ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నాము" అని తెలిపారు. అయితే, ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఎవరు ఈ గౌరీ స్ప్రాట్?

బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ వెల్‌నెస్ , బ్యూటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈమె బ్రిటీష్ సంతతికి చెందిన ప్రముఖ రచయిత, మేధావి ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు. గతంలో జరిగిన వివాహం ద్వారా గౌరీకి 'క్విన్' అనే కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆమిర్ ఖాన్ తన సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన తర్వాత, వీరు మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు.

ఆమిర్ ఖాన్ గతం.. మూడో వివాహం

ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కానుంది. ఆయన మొదటి భార్య రీనా దత్తా, వీరిద్దరికి జునైద్ ఖాన్ , ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఫిలిం మేకర్ కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆమిర్, సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2021లో విడిపోయారు. విడిపోయినప్పటికీ, వారు తమ కుమారుడు ఆజాద్‌ను కలిసి పెంచుకుంటూ, ప్రొఫెషనల్‌గా కూడా సహకరించుకుంటున్నారు.

జూలై 5న జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం ఆమిర్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమిర్ ఖాన్ , గౌరీ స్ప్రాట్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story