Sangareddy: ఆందోల్ మండలం తలెల్మాలో వివాహిత ఆత్మహత్య!

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తలెల్మాలో భర్త వివాహేతర సంబంధంతో మనస్తాపం చెంది ప్రతిభ (27) అనే గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దర్యాప్తు.

UMASHANKAR, ANDOLE
Published on: 19 Oct 2026 10:10 AM IST
Sangareddy
X

Sangareddy: ఆందోల్ మండలం తలెల్మాలో వివాహిత ఆత్మహత్య!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. పరాయి స్త్రీల వ్యామోహంలో పడి, కన్న పిల్లలను, భార్యను నిర్లక్ష్యం చేశాడు. భర్త అర్జున్ వివాహేతర సంబంధాన్ని భరించలేక.. ఆందోల్ మండలం తలెల్మా గ్రామంలో ప్రతిభ అనే 27 ఏళ్ల గృహిణి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మానూర్ మండలం దన్నారం గ్రామానికి చెందిన ప్రతిభకు, అర్జున్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుఖంగా సాగాల్సిన కాపురంలో భర్త అక్రమ సంబంధాలు చిచ్చు పెట్టాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రతిభ అర్ధరాత్రి ఇంట్లోనే తనువు చాలించింది.

అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కట్టుకున్న భర్త అర్జున్ వేరొక మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధమే ప్రతిభ ప్రాణాలు తీసేలా చేసింది. నిన్నటివరకు పిల్లలతో కళకళలాడిన ఆ ఇల్లు.. ప్రతిభ ఆత్మహత్యతో శ్మశానంగా మారింది. మానూర్ మండలం దన్నారం నుంచి తలెల్మా గ్రామానికి కోడలిగా వచ్చిన ప్రతిభ.. భర్త వేధింపులను భరించలేకపోయింది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారనే ఆశ కూడా ఆమెను బతికించలేకపోయింది.

విషయం తెలుసుకున్న జోగిపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతిభ మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త అర్జున్ వేధింపుల వల్లే ప్రతిభ ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు జోగిపేట పోలీస్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్నతల్లి దూరమై, తండ్రి జైలు పాలయ్యే పరిస్థితి రావడంతో.. ఆ ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది."

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE