Shivampet: చెత్త బుట్టలు, రేషన్ కార్డుల పంపిణీ - సర్పంచ్ వెంకటేశ్వర్!

Shivampet: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో తడి, పొడి చెత్త బుట్టలు మరియు అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 29 Sept 2026 5:33 PM IST
Shivampet
X

Shivampet: చెత్త బుట్టలు, రేషన్ కార్డుల పంపిణీ - సర్పంచ్ వెంకటేశ్వర్!

Shivampet: శివ్వంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త బుట్టలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజీ పేట వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.

గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని సర్పంచ్ వెంకటేశ్వర్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా గ్రామపంచాయతీ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇసుగారి మలేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి, GPO యాదగిరి, వార్డు సభ్యులు ముయ్యడి ముత్యాలు, పెద్దగోని శ్రీనివాస్, కొవ్వూరి యాదగిరి, రెడ్డిపల్లి స్వరూప-అశోక్, కొడకంచి గణేష్ గౌడ్, పెద్దకోలా విక్రమ్, కామల్యగారి మాళేశ్వరి-నర్సింలు, ఈసారపు రాజు గౌడ్, కిషన్, గ్రామ శాఖ ముద్దగాళ్ల లక్ష్మీనర్సయ్య, మాజీ వార్డు సభ్యుడు వంజరి కొండల్తో పాటు గ్రామ పెద్దలు రామ గౌడ్, దొడ్ల అశోక్, గొట్టిముక్ల వెంకటేష్, ముయ్యడి నర్సింలు, మ్యాస మహేష్, బసంపల్లి నర్సిములు, కమ్మరి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తడి, పొడి చెత్తను వేరు చేయడం ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ప్రతినిధులు కోరారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR