Toopran: తూప్రాన్ పరిధి పాడల్‌పల్లిలో నూతన పెన్షన్ ధ్రువపత్రాల పంపిణీ!

Toopran: తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు పాడల్‌పల్లిలో కాంగ్రెస్ యువనాయకుడు వర్గాంటి గౌతమ్ గౌడ్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ ధ్రువపత్రాలను అందజేశారు.

RAJU,TOOPRAN
Published on: 19 Nov 2026 12:50 PM IST
Toopran
X

Toopran: తూప్రాన్ పరిధి పాడల్‌పల్లిలో నూతన పెన్షన్ ధ్రువపత్రాల పంపిణీ!

Toopran: తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11 వ వార్డు పాడల్‌పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పెన్షన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకుడు వర్గాంటి గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వర్గాంటి గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

పెన్షన్ ధ్రువపత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, యువనాయకుడు గౌతమ్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మల్లేష్ యాదవ్ స్వామి గౌడ్ లవకుమార్ యాదవ్ వెంకటేష్ యాదవ్ కార్యకర్తలు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN