Sangareddy: సంగారెడ్డి నియోజకవర్గ TRS నూతన పార్టీ పదవుల ప్రకటన!

Sangareddy: హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ నూతన పార్టీ పదవులను ప్రకటించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ.

Srinivas K, Sangareddy
Published on: 2 Nov 2026 10:42 AM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి నియోజకవర్గ TRS నూతన పార్టీ పదవుల ప్రకటన!

Sangareddy: హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నూతన పార్టీ పదవులను ప్రకటించి, నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కలబ్గూర్ దయాకర్ రెడ్డి ప్రతిపాదించి, బలపరిచిన నాయకులకు వివిధ హోదాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించారు.

నూతన నియామకాల వివరాలు:

పట్టణ అధ్యక్షులు:

1. సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు – చంద్రిక కరుణాకర్.

2. సదాశివపేట పట్టణ అధ్యక్షుడు – గౌరెడ్డి మనోజ్ రెడ్డి.

అనుబంధ విభాగాల సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు కన్వీనియర్లు:

1. ముస్లిం విభాగం – మహమ్మద్ ముజాహిద్.

2. న్యాయ రక్షణ విభాగం – ప్రియా రెడ్డి.

3. విద్యార్థి విభాగం – మదన్నోళ్ల రాహుల్.

4. జర్నలిస్ట్ విభాగం – సందీప్ కుమార్.

5. ఐటీ విభాగం కన్వీనియర్ – సాయికాంత్ గౌడ్.

6. దళిత విభాగం కన్వీనియర్ – మన్నె నవీన్.

7. సోషల్ మీడియా విభాగం – బి. వేణు.

8. ట్రేడ్ అండ్ కామర్స్ విభాగం – ఎన్. కృష్ణ మోహన్.

నూతనంగా నియమితులైన నాయకులందరూ హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మను మర్యాదపూర్వకంగా కలిసి, తమకు పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కలబ్గూర్ దయాకర్ రెడ్డి నూతనంగా నియమితులైన నాయకులందరినీ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షురాలు కవిత తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామగ్రామాన పార్టీని విస్తరించి, అన్ని కులాలు, మతాలు, వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులను కలుపుకొని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

నూతనంగా నియమితులైన ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేస్తూ తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తూ పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పట్టణ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనియర్లు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy