Hyderabad: హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా సంవిధాన్ రక్షా మార్చ్!
Hyderabad: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా సంవిధాన్ రక్షా మార్చ్!
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ (రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ) ఘనంగా జరిగింది.
ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ నెక్లెస్ రోడ్‌లోని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు ,గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
అలాగే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.




