Toopran: తూప్రాన్‌లో వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా పడి పూజ!

Toopran: తూప్రాన్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 18వ మహా పడి పూజ ఆదివారం వైభవంగా జరిగింది. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

RAJU,TOOPRAN
Published on: 29 Nov 2026 3:38 PM IST
Toopran
X

Toopran: తూప్రాన్‌లో వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా పడి పూజ!

తూప్రాన్: తూప్రాన్ పట్టణం లో ఆదివారం అయ్యప్ప భక్తితో పులకించింది. పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 18వ మహా పడి పూజా అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

18 ఏళ్ల నిర్విరామ సేవా యాత్ర:

స్టేషన్ శ్రీనివాస్ సర్పంచ్ గురుస్వామి ఆధ్వర్యంలో, ఆలయ గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ఈ మహా పడి పూజా నిర్వహించారు. గత 18 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం విడువకుండా ఈ పడి పూజాను నిర్వహిస్తూ వస్తుండడం విశేషం. ఈ ఏడాది కూడా అదే భక్తి శ్రద్ధలతో, అదే వైభవంతో పూజను జరిపించారు.

భజన, నామస్మరణతో మార్మోగిన ఆలయం:

పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు భజనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది. "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ భక్తులు చేసిన నినాదాలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. మాలధారులు నల్లని వస్త్రాలతో, ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తరించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలో భాగమయ్యారు.

స్టేషన్ శ్రీనివాస్ ఆవేదన, అనుభవం:

ఈ సందర్భంగా స్టేషన్ మాసాయి పేట్ సర్పంచ్ ఎర్వ శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ, అయ్యప్ప మాల వేసుకున్నాక తన జీవితంలో వచ్చిన మార్పు, అభివృద్ధి గురించి భావోద్వేగంతో వివరించారు. అయ్యప్ప దీక్ష తనకు క్రమశిక్షణను, ధైర్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇచ్చిందని, స్వామివారి ఆశీస్సులతోనే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. తన కుమారుడైన అరవింద్ కన్నె స్వామి కూడా ఈ ఏడాది మాలధారణ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, తండ్రిగా అది తన జీవితంలో మరపురాని ఘట్టమని సర్పంచ్ తెలిపారు.

గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ ప్రవచనం:

ఆలయ గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అయ్యప్ప దీక్ష అంటే కేవలం నల్ల బట్టలు వేసుకోవడం కాదని, అది మనసును, శరీరాన్ని, ఆలోచనలను పవిత్రం చేసుకునే 41 రోజుల తపస్సు అని వివరించారు. దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, సేవా భావంతో మెలగాలని, శబరిమల యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని భక్తులకు సూచించారు. భక్తులందరూ స్వామివారి కృపతో ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని గురుస్వామి ఆకాంక్షించారు.

అన్నప్రసాద వితరణ:

పూజ అనంతరం వచ్చిన అయ్యప్ప స్వాములకు, భక్తులందరికీ తీర్థ ప్రసాదంతో పాటు ఘనంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఎవరూ ఆకలితో వెళ్లకూడదనే సంకల్పంతో నిర్వాహకులు అందరికీ కడుపునిండా భోజనం పెట్టారు.

ఈ కార్యక్రమంలోబజారు రూపేష్ గురుస్వామి సత్యనారాయణగౌడ్ వెంకటేష్ గౌడ్ మలే శ్రీనివాస్ కుమార్ యదా గౌడ్ గురు స్వాములు రాజకీయ నాయకులు మాజీ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి విట్టల్ రెడ్డి లు హాజరైన రు విజయవంతం కావడానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు, స్థానిక యువకులు ఎంతో కృషి చేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN