Toopran: విద్యార్థులకు ఆయుధాలు, పోలీసు సేవలపై అవగాహన!
Toopran: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తూప్రాన్ పీఎస్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయుధాల పనితీరును వివరించారు.
Toopran: విద్యార్థులకు ఆయుధాలు, పోలీసు సేవలపై అవగాహన!
తూప్రాన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, త్యాగాలు మరియు పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ నరేంద్ర గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం అలవర్చుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లా పోలీస్ మరియు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చెందిన అధికారులు వివిధ రకాల పోలీస్ ఆయుధాలు, వాటి వినియోగం, పనితీరు గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ టౌన్ ఎస్ఐ వి. గంగరాజు, ఎస్ఐ జ్యోతి, ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ మధుసూదన్ రావు, ఏఆర్ఎస్ఐ శ్రీ భవానీ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




