Toopran: సద్దుల బతుకమ్మ వేడుకలకు ముస్తాబైన తూప్రాన్ పెద్ద చెరువు కట్ట
Toopran: తూప్రాన్ పెద్ద చెరువు కట్ట సద్దుల బతుకమ్మ వేడుకలకు ముస్తాబైంది. ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ బొంది రజని, కమిషనర్ రమేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Toopran: సద్దుల బతుకమ్మ వేడుకలకు ముస్తాబైన తూప్రాన్ పెద్ద చెరువు కట్ట
Toopran: సద్దుల బతుకమ్మ వేడుకలకు ముస్తాబైన తూప్రాన్ పెద్ద చెరువు కట్ట, తూప్రాన్ లో సోమవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు పెద్ద చెరువు కట్ట అంగరంగ వైభోగంగా ముస్తాబైంది. బతుకమ్మ ఘాట్ కు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, చెట్లకు రంగులు వేసి, కలర్ లైట్లతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు మున్సిపల్ సిబ్బంది. ఆదివారం ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ రమేష్ పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ... తూప్రాన్ లో సోమవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. విద్యుత్ దీపాలు, మంచినీటి సౌకర్యం, పార్కింగ్, భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని చైర్ పర్సన్ రజని పిలుపునిచ్చారు.
వారి వెంట మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.




