Medak: తూప్రాన్ మహంకాళి ఆలయంలో దుర్గాదేవి దర్శనం!
Medak: తూప్రాన్ మహంకాళి ఆలయంలో 8వ రోజు దుర్గాదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పూజలు చేశారు.
Medak: తూప్రాన్ మహంకాళి ఆలయంలో దుర్గాదేవి దర్శనం!
Medak: తూప్రాన్ పట్టణం లోని మహంకాళి ఆలయ ఆవరణలో శ్రీ దుర్గ భవాని సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రులలో భాగంగా 8వ రోజు ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా గజ్వేల్ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... దుర్గామాత ఆశీస్సులతో తూప్రాన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాననిఅయన అన్నారు. 28 ఏళ్లుగా ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటేశ్వరరావు, తాటి విట్టల్, మహేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బజారు చక్రవర్తి చెలిమల రఘుపతి బొడ్డు రమ్య శ్రీహరి శ్రీనివాస్ రెడ్డి వేణుగోపాల్ , కార్యకర్తలు పాల్గొన్నారు.




