Toopran: తూప్రాన్‌లో అక్రమ ఆవుల తరలింపు వాహనం పట్టివేత
Toopran: తూప్రాన్‌లో అక్రమ ఆవుల తరలింపు వాహనాన్ని దుర్గా భవాని సేవా సమితి పట్టుకుంది. గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోటేశ్వరరావు హెచ్చరించారు.
Toopran: తూప్రాన్‌లో అక్రమ ఆవుల తరలింపు వాహనం పట్టివేత
తూప్రాన్: తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని తూప్రాన్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని దుర్గాభవాని సేవ సమితి కార్యకర్తలు వాహనాన్ని ఆపి ఆవులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గోవద నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తూప్రాన్ లో బస్టాండ్ సమీపంలో బీఫ్ దుకాణాలను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం లిఖితపూర్వకంగా గోవధను నిషేధించాలని గోమాంసాన్ని అమ్మే వారిపై కఠిన చర్య తీసుకోవాలని హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే ఆవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధ్యక్షులు కోటేశ్వరరావు మరియు నిర్వాహకులు తాటి విట్టల్ సూర్య ప్రకాష్ గౌడ్, సతీష్ యాదవ్, ఆనంద్, శ్రవణ్ శ్రవణ్ డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో గోమాత జోలికొస్తే సహించేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతామని వారు డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవధ నిర్వహిస్తే గోవులను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు




