Toopran: జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌కు తూప్రాన్ గీతా హైస్కూల్ విద్యార్థినులు

Toopran: తూప్రాన్ గీతా హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు బి. మహతి, కె. కృతిక పుదుచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యారు.

RAJU,TOOPRAN
Published on: 13 Nov 2026 4:01 PM IST
Toopran
X

Toopran: జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌కు తూప్రాన్ గీతా హైస్కూల్ విద్యార్థినులు

తూప్రాన్: తూప్రాన్ గీతా హై స్కూల్ విద్యార్థినులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినులు బి. మహతి, కె. కృతిక ఫైనల్ నేషనల్ లెవల్ ఎగ్జిబిషన్ కు ఎంపికయ్యారు.

వీరు తమ ఇన్నోవేటివ్ ఎగ్జిబిట్ ను పుదుచ్చేరిలో డిసెంబర్ 13 నుండి 19 వరకు జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. తూప్రాన్ నుండి జాతీయ వేదికకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

విద్యార్థినులను మెంటార్ చేస్తూ, నిరంతరం ప్రోత్సహిస్తూ మార్గదర్శకత్వం వహించిన సల్మా ఆగా గారికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.

ఈ ఘనత సాధించిన విద్యార్థినులను పాఠశాల కరెస్పాండెంట్, చైర్ పర్సన్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. "Your Innovation - Our Pride - A National Platform!" అంటూ పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN