Toopran: మహంకాళి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి
Toopran: తూప్రాన్ మహంకాళి ఆలయంలో రాజరాజేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి. అన్నప్రసాద వితరణ ప్రారంభం.
Toopran: మహంకాళి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి
తూప్రాన్: అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి అన్నారు శనివారం తూప్రాన్ లోని మహంకాళి దేవాలయ ఆవరణలో నవదుర్గ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు రాజరాజేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు కుంభహారతి నక్షత్ర హారతి నిర్వహించారు.
అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాముని గారి స్వప్న నాగరాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ రెడ్డి వైస్ చైర్మన్ మామిండ్ల కృష్ణ ముదిరాజ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్ రెడ్డి, పల్లెర్ల రవీందర్ గుప్తా, నాగేష్ ముదిరాజ్, జింక మల్లేష్, ఆంజనేయులు గౌడ్, పురం రవి, సబ్బని వెంకటేష్ , బాయికాడి వెంకటేష్, మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ తాటి విట్టల్, నిర్వాహకులు కోటేశ్వరరావు, మహేష్ గౌడ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.




