Toopran: ఎస్సై ప్రిలిమ్స్ అభ్యర్థులకు స్వర్ణలత భాగ్యరాజ్ ఆల్ ది బెస్ట్

Toopran: తూప్రాన్ మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆదివారం జరగనున్న ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఆత్మవిశ్వాసం నింపుతూ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

RAJU,TOOPRAN
Published on: 28 Nov 2026 11:12 PM IST
Toopran
X

Toopran: ఎస్సై ప్రిలిమ్స్ అభ్యర్థులకు స్వర్ణలత భాగ్యరాజ్ ఆల్ ది బెస్ట్

తూప్రాన్: రేపు జరగనున్న ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మనోధైర్యం కల్పిస్తూ "ఆల్ ది బెస్ట్" తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో రోజుల కష్టం, మరెన్నో రాత్రులు నిద్రలేని చదువు రేపటి పరీక్షలో మీ విజయానికి పునాది కావాలని ఆకాంక్షించారు.

"పరీక్షను యుద్ధంలా భావించండి. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా, పట్టుదలను కవచంగా చేసుకోండి. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా మీ సంకల్పం దానికంటే బలంగా ఉండాలి. ఒక్క పరీక్ష మీ జీవితాన్ని నిర్ణయించదు, కానీ మీ జీవితాన్ని మార్చే అవకాశం మాత్రం ఇదే కావచ్చు" అని అభ్యర్థులకు సూచించారు.

మీ తల్లిదండ్రుల ఆశలు, మీ కుటుంబం కలలు, మీ కష్టం అన్నీ మీ విజయానికి స్ఫూర్తిగా నిలవాలని, తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి తెలిసిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయాలని ఆయన కోరారు.

ఖాకీ యూనిఫాం కేవలం ఉద్యోగం కాదని, అది బాధ్యత, క్రమశిక్షణ, సమాజానికి సేవ చేసే అవకాశమని పేర్కొన్నారు. మీ కలల కోసం మీరు చేసిన పోరాటానికి రేపటి పరీక్ష తొలి విజయ సంకేతం కావాలని, మీ కల నెరవేరాలని, మీ కష్టం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభ్యర్థులందరికీ అల్ దా బెస్ట్...

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN