Manoharabad: మనోహరాబాద్ పీఎస్‌ను తనిఖీ చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్!

Manoharabad: మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను గురువారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తనిఖీ చేసి, పెండింగ్ కేసుల పరిష్కారం, డయల్-112 స్పందనపై ఆదేశాలిచ్చారు.

RAJU,TOOPRAN
Published on: 19 Nov 2026 5:58 PM IST
Manoharabad
X

Manoharabad: మనోహరాబాద్ పీఎస్‌ను తనిఖీ చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్!

తూప్రాన్: తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ గురువారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, క్రైమ్ ఫైల్స్, కేసు డైరీలు, కానిస్టేబుల్ కిట్స్, ఇతర రిజిస్టర్లు మరియు సిబ్బంది నిర్వహణ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.పెండింగ్‌లో ఉన్న ఆస్తి సంబంధిత నేరాలను ఛేదించి, దొంగిలించబడిన ఆస్తిని రికవరీ చేయాలి.ప్రతి డయల్-112 కాల్‌కు తక్షణమే స్పందించి బాధితులకు సత్వర సేవలు అందించాలి. అనుమానితుల షీట్లు రౌడీ షీట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.పోలీస్ స్టేషన్ రికార్డులు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలి.

కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలి.సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరును మెరుగుపరచడానికి మరియు నేర నియంత్రణకు అవసరమైన పలు సూచనలను డీఎస్పీ సిబ్బందికి అందించారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN