Toopran: తూప్రాన్ గీతా స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Toopran: తూప్రాన్ గీతా పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 200 మంది విద్యార్థులు చాచాజీ ఆకారంలో కూర్చుని చాచా నెహ్రూపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

RAJU,TOOPRAN
Published on: 13 Nov 2026 2:15 PM IST
Toopran
X

Toopran: తూప్రాన్ గీతా స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

తూప్రాన్: తూప్రాన్ గీతా స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది విద్యార్థులు పాఠశాల మైదానంలో "చాచాజీ" ఆకారంలో కూర్చుని చాచా నెహ్రూ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ అరుదైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ... నెహ్రూజీకి బాలల పట్ల ఉన్న ప్రేమానురాగాలను విద్యార్థులకు వివరించారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారి చదువు, క్రమశిక్షణే దేశ అభివృద్ధికి పునాది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి. ఉష, డైరెక్టర్లు రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, భరత్, డాక్టర్ మౌనిక, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN