Toopran: మల్కాపూర్ గ్రామంలో 424వ వారం స్వచ్ఛ భారత్!

Toopran: తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో 424వ వారం స్వచ్ఛ భారత్ కొనసాగింది. పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో తొలగించారు.

RAJU,TOOPRAN
Published on: 25 Oct 2026 6:56 PM IST
Toopran
X

Toopran: మల్కాపూర్ గ్రామంలో 424వ వారం స్వచ్ఛ భారత్!

Toopran: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 424వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని న్యూ హమ్నాపూర్ తండాలో ఘనంగా చేపట్టారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రపరిచారు. రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం పట్ల సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ని రహదారి ప్రయాణికులు అభినందించారు.

ఈ కార్యక్రమం నిర్విరామంగా 424 వారాలుగా కొనసాగడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్కాపూర్ గ్రామం స్వచ్ఛతలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, రేఖ నాగరాజుగౌడ్, సరిత పరమేష్ గౌడ్, బాక్స్ మాజీ డైరెక్టర్ గోపి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN