Medak: సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీపై విచారణ!
Medak: శివంపేట మండలం సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు పరిశీలన, భద్రతా చర్యలపై సిబ్బందికి కీలక ఆదేశాలు.
Medak: సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీపై విచారణ!
మెదక్: మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు మంగళవారం ఉదయం సందర్శించారు.
ఇటీవల ఆదివారం రాత్రి ఆలయంలో జరిగిన చోరీ ఘటన నేపథ్యంలో ఆయన ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరుపై శాఖాపరంగా విచారణ చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆలయ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సహాయ కమిషనర్ సూచించారు. ఆలయ నిర్వహణకు సంబంధించి కూడా పలు సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో మెదక్ జిల్లా హుండీ పరిశీలకులు (ఇన్స్పెక్టర్) వి. రంగారావు, జూనియర్ సహాయకులు నరసింహారెడ్డి, ఆలయ అర్చకులు ధనుంజయ శర్మతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




