Sangareddy: జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష!

Sangareddy: జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఎంపిక పరీక్ష నిర్వహణ.

UMASHANKAR, ANDOLE
Published on: 10 Oct 2026 3:50 PM IST
Sangareddy
X

Sangareddy: జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష!

Sangareddy: పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు ఎంపిక పరీక్ష నిర్వహించారు. నేడు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఎంపిక పరీక్ష నిర్వహించారు . ఈ ఎంపిక పరీక్షకు 390 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగ 265 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇందులో 120 మందిని ఎంపిక చేసి వారికి షేర్ ఇండియా సంస్థ సౌజన్యంతో ఉచిత బోధన, స్టడీ మెటీరియల్ అందిస్తూ 45 రోజుల పాటు జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 5:30 నిమిషాల వరకు ఉచిత శిక్షణ అందిస్తారు.

ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోగిపేట సి.ఐ అనిల్ కుమార్ కోరారు.ఈ కార్యక్రమంలో నారాయణ ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి, జోగిపేట సి. ఐ అనిల్ కుమార్, జోగిపేట ఎస్.ఐ. గిరి శ్రీకాంత్,హాజరుయ్యారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE