Toopran: విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లుతో కలిసి లైన్‌ను ప్రారంభించిన సర్పంచ్!

Toopran: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి 24 గంటల త్రీఫేస్ విద్యుత్ సరఫరాను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఏఈ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

RAJU,TOOPRAN
Published on: 28 Nov 2026 3:05 PM IST
Toopran
X

Toopran: విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లుతో కలిసి లైన్‌ను ప్రారంభించిన సర్పంచ్!

Toopran: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి 24 గంటల త్రీఫేస్ విద్యుత్ లైన్ సరఫరాను శనివారం ఘనంగా ప్రారంభించారు.విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లుతో కలిసి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఈ విద్యుత్ సరఫరాను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో త్రీఫేస్ విద్యుత్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుత ప్రభుత్వంలో మంజూరు అయిందని తెలిపారు.

24 గంటల త్రీఫేస్ విద్యుత్ రావడంతో గ్రామంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఏర్పడిందని, పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన కోరారు.ఈ సదుపాయం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN