Sangareddy: కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన కైలాసగిరి శివాలయం!

Sangareddy: కార్తీక మాసం, పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ కైలాసగిరి శివాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

SATYANARAYANA, ZHAHEERABAD
Published on: 25 Nov 2026 7:08 AM IST
Sangareddy
X

Sangareddy: కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన కైలాసగిరి శివాలయం!

సంగారెడ్డి: శ్రీ కైలాసగిరి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పరమశివుడిని వేడుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు దీపాలు వెలిగించి భక్తులు వారి భక్తిని చాటుకున్నారు.

శ్రీ కైలాసగిరి శివాలయం ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. హర హర మహాదేవ, ఓం నమఃశివాయ అనే శివనామస్మరణతో ఆలయ ప్రాంతమంతా మార్మోగుతోంది. భక్తి భావంతో శ్రీ కైలాసగిరి శివాలయానికి తరలివస్తున్న భక్తులతో జహీరాబాద్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

SATYANARAYANA, ZHAHEERABAD

SATYANARAYANA, ZHAHEERABAD