Sangareddy: సోనియాగాంధీ జీవితంపై సినిమా తీస్తా: జగ్గారెడ్డి సంచలన ప్రకటన!
Sangareddy: సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశారు.
Sangareddy: సోనియాగాంధీ జీవితంపై సినిమా తీస్తా: జగ్గారెడ్డి సంచలన ప్రకటన!
సంగారెడ్డి: సోనియాగాంధీ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా తీస్తానన్న జగ్గారెడ్డి. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడి. సోనియాగాంధీ ఆత్మకథ (బీ లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్) ను తెలుగు భాషలో సినిమాగా మారుస్తా. పార్టీ నాయకులు డబ్బులు రెడీ చేసుకోండి, ప్రజలకు సోనియాగాంధీ జీవిత చరిత్రని సినిమా ద్వారా చూపించాలి. ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంక గాంధీలకు తల్లిగా ఆమె జీవితాన్ని సినిమాలో చూపిస్తా సోనియాగాంధీది ఒక విజయవంతమైన రాజకీయ జీవితం.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తా, ఈ సినిమాకి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలే ప్రొడ్యూసర్లు, సినిమా కోసం ఓ కమిటీ వేసి..ప్రక్రియ ప్రారంభిస్తా దేశంలో సోనియాగాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను దగ్గరుండి చూశారు.
సముద్రం ఎంత లోతో...అంతటి రాజకీయ వ్యవస్థతో కూడింది కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీకి ప్రధాని కుర్చీపై వ్యామోహం లేదు, భర్త చనిపోయాక ప్రధాని అయ్యే అవకాశం ఉన్న పీవీని ప్రధాని చేసింది. UPA ప్రభుత్వం వచ్చాక సోనియని ప్రధానిగా ఉండాలని అందరూ కోరిన ఆమె మాత్రం మన్మోహన్ సింగ్ ని ప్రధాని చేసింది. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న సోనియా వదులుకుంది..అది ఓ చరిత్ర రాహుల్ ప్రధాని కావాలనేది సోనియా కోరిక.




