Sangareddy: సంగారెడ్డి పట్టణ టీఎన్జీఓస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!

Sangareddy: సంగారెడ్డి పట్టణ టీఎన్జీఓస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యాదవ రెడ్డి, కార్యదర్శిగా వెంకటేష్ ఎన్నికయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 10:38 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి పట్టణ టీఎన్జీఓస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!

సంగారెడ్డి: టీఎన్జీవోస్ సంగారెడ్డి పట్టణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ మహమ్మద్ జావిద్ అలీ, టీఎన్జీవోస్ కార్యదర్శి వేల్పూరు రవి అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నికల కార్యక్రమానికి టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సంఘం అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసే విధంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ సంఘం అధ్యక్షులుగా యాదవ రెడ్డి, కార్యదర్శిగా వెంకటేష్, అసోసియేట్ అధ్యక్షులుగా రమేష్, కోశాధికారిగా హైమద్ ఖాన్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రాజు, సుజాత, నాగమణి, ప్రదీప్, జాయింట్ సెక్రటరీలుగా గోపాల్, పర్వీన్ బేగం, అజాం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రావణి ఎన్నికయ్యారు.

సంఘం సభ్యులుగా వసీమ, హైమద్, కిరణ్, యాదయ్య, లావణ్య, లతా, పజిల్ హైమద్, అజయ్, మునవర్, ఇమ్రాన్ ఖాన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, సంఘటిత శక్తిని మరింత బలోపేతం చేయడం నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల ఐక్యత, పరస్పర సహకారం, సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ కోశాధికారి శ్రీనివాస్, కృష్ణ, సుధామణి నాగేశ్వరరావు, మల్లికార్జున్, రషీద్, షరీఫ్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్