Sangareddy: సంగారెడ్డి పోలీస్ ఆయుధాగారంలో ఎస్పీ ఆయుధ పూజ!

Sangareddy: దుర్గాష్టమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులు!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Oct 2026 3:16 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి పోలీస్ ఆయుధాగారంలో ఎస్పీ ఆయుధ పూజ!

Sangareddy: సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు ఆయుధాగారం, మోటర్ వెహికిల్ సెక్షన్ లలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలో విధులు నిర్వహించేందుకు ఉపయోగించే ఆయుధాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, జిల్లా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి ఉంటుందని తెలిపారు.

దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఆయుధాలు పోలీసు విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపిఎస్., డిఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్ డిఎస్పీ నరేందర్, ఆర్ఐ లు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, టౌన్ సిఐ రాము నాయుడు

పోలీసు అధికారులు, ఆయుధాగార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్