Sangareddy: పారదర్శకంగా, ప్రశాంతంగా టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాలి!

Sangareddy: గీతం యూనివర్సిటీలో టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్. భద్రత, పారదర్శకతపై అధికారులకు ఆదేశాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Oct 2026 8:16 AM IST
Sangareddy
X

Sangareddy: పారదర్శకంగా, ప్రశాంతంగా టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాలి!

Sangareddy: గీతం యూనివర్సిటీలో టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో 24.10.2026న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) నేపథ్యంలో, రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద చేపట్టనున్న పోలీసు బందోబస్తు, అభ్యర్థుల రాకపోకల మార్గాలు, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

పరీక్షా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఇస్నాపూర్ ఇన్‌స్పెక్టర్, భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, మహేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావ్, గీతం యూనివర్సిటీ యాజమాన్యం వర్మ, సతీష్ తదితరులు ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్