Sangareddy: కాంగ్రెస్ వైఫల్యాలపై గ్రామాల్లో పాదయాత్ర: చింతా ప్రభాకర్!

Sangareddy: కాంగ్రెస్ వైఫల్యాలపై గ్రామగ్రామాన పాదయాత్ర చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. సదాశివపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

SRIKANTH, SANGAREDY
Published on: 3 Nov 2026 10:11 PM IST
Sangareddy
X

Sangareddy: కాంగ్రెస్ వైఫల్యాలపై గ్రామాల్లో పాదయాత్ర: చింతా ప్రభాకర్!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

అంతకుముందు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ అరెస్టులు, వేధింపులు, అవమానాల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తల సమస్యలను సావధానంగా విన్న చింతా ప్రభాకర్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలోనే గ్రామగ్రామాన పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలోని నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అంతర్గత కుమ్ములాటలతో కాలం గడుపుతున్నారని, అలాంటి నాయకులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించలేని అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిందని మండిపడ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు.. రైతులకు అవసరమైన విద్యుత్, సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. పార్టీ కార్యకర్తకు ఏ చిన్న ఆపద వచ్చినా, సమస్య ఎదురైనా ఒక్క మిస్ కాల్ చేయండి.. మీ ముందుకు వచ్చి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలకు తావివ్వకుండా ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను ఎవరినీ ఇబ్బందులకు గురిచేయలేదన్నారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారు అనుసరిస్తున్న విధానాలే భవిష్యత్తులో వారికి ఎదురవుతాయని హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అదే సమయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఇట్టి కార్యక్రమములొ సి డి సి మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు గడిల సుధీర్ రెడ్డి కోడూరి రమేష్ కుందనరాజు పట్టణ పార్టీ అధ్యక్షులు చిల మల్లన్న సీనియర్ నాయకులు చింత సాయినాథ్ ఆత్మకూరు నగేష్ స్థానిక సర్పంచ్ తొంట కిష్టయ్య స్థానిక మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి గడ్డమీద సత్యనారాయణ మాజీ ఎంపీటీసీలు సత్యనారాయణ యాదవ్ అమరేందర్ రెడ్డి సుధాకర్,

మాధవరెడ్డి శివకుమార్ అల్లం లలిత అహ్మద్ అశోక్ పండరి సర్పంచులు రవికుమార్ కృష్ణారెడ్డి సంతోష్ గౌడ్ ప్రమోద్ నవీన్కుమార్ నాగరాజు గుడ్ల లక్ష్మణ్ యువత అధ్యక్షులు నరేష్ గౌడ్ నగేష్ యాదవ్ బిఆర్ఎస్వి ఇన్చార్జ్ శ్రీహరి నిజాముద్దీన్ సలావుద్దిన్ పాండు నాయక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్లు మాణిక్ రాములు దశరథ్ నగేష్ సిద్ధన్న సంగమేష్ కరుణాకర్ సంఘన్న శేఖర్ రాములు నాయకులు యాద గౌడ్ శంభు ప్రసాద్ నబీమియా జైపాల్ శ్రీనివాస్ రెడ్డి రఫీ షబ్బీర్ రమేష్ పాషా రవి శివ తదితర నాయకులు పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY