Sangareddy: సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో
Sangareddy: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంట వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. గుంతల రోడ్డు వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sangareddy: సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరో ప్రమాదానికి కారణమైంది.. ఆందోల్ మండలం చింతకుంట వద్ద ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి.. అధ్వానంగా మారిన రోడ్డే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది..
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి..
జోగిపేట - మెదక్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో.. ఆటో అదుపుతప్పి గుంతలో పడి.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో చిలిపిచేడ్ మండలం చండూరుకు చెందిన ఆటో డ్రైవర్ గొల్ల లక్ష్మణ్ పరిస్థితి విషమంగా మారింది..
క్షతగాత్రుడిని స్థానికులు ప్రైవేట్ వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. విషయం తెలుసుకున్న జోగిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాదంపై వివరాలు ఆరా తీస్తున్నారు..
అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డు దుస్థితేనని స్థానికులు మండిపడుతున్నారు.. జోగిపేట - మెదక్ రోడ్డు గుంతలమయంగా మారి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రోడ్డు నిర్మాణం చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు..




