Sangareddy: జీవో నెం.6 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి: సీఐటీయూ!
Sangareddy: పరిశ్రమల యాజమాన్యాలు జీవో నెం.6 ప్రకారం కనీస వేతనాలు, దసరా బోనస్ చెల్లించాలని పాశమైలారంలో సీఐటీయూ రాష్ట్ర నేత అతిమేల మానిక్ డిమాండ్ చేశారు.
Sangareddy: జీవో నెం.6 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి: సీఐటీయూ!
సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవో నెంబర్ 6 ప్రకారం కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు వేతనాలు చెల్లించాలని దసరా పండుగ లోపు బోనస్ ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 42000/-పెంచాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు.
ఈరోజు పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో కనీస వేతనం చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల్లో కరపత్ర ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అతిమేల మానిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించాలంటూ జీవో నెంబరు.6ను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసి నాలుగు నెలలైనా అనేక పరిశ్రమలు అమలు కావడం లేదని అన్నారు. ఈ పెరిగిన వేతనాలను జూన్ ఒకటో తేదీ నుండి అమలు చేయవలసినప్పటికీ యాజమాన్యాలు చేయడం లేదని అన్నారు. 2012 తర్వాత కనీస వేతనం సవరణ జరగలేదని అన్నారు.
కనీస వేతనాలను శాస్త్రీయంగా సవరించకపోగా ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించిందని అన్నారు. కుటుంబ అవసరాలు, జీవన వ్యయం, వినియోగదారుల ధరల సూచీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకో లేదని అన్నారు. కనీస వేతనాలను శాస్త్రీయంగా సవరించి రూ.42,000/-లు ప్రకటించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని అన్నారు.
పరిశ్రమల యాజమాన్యాలు జీవో నెం.6 ప్రకారం కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని, దసరా పండగ లోపు బోనస్ చట్టం ప్రకారం ఇవ్వాలని, చట్టబద్ధమైన ఈఎస్ఐ పిఎఫ్ ఓటి డబుల్ ఇయల్స్ సెలవులు వంటివి అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేశారు. అక్టోబర్ 17న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు నాయకులు శ్రీనివాస్ దుర్గయ్య యాదయ్య నగేష్ శ్రీను సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




