Sangareddy: వ్యాపారులు ఫుడ్ లైసెన్స్ పొందాలి: ఆహార భద్రతా శాఖ!
Sangareddy: సంగారెడ్డి జిల్లా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న నారాయణఖేడ్‌లో ఫుడ్ లైసెన్స్ మేళా నిర్వహించనున్నారు. వ్యాపారులు FSSAI లైసెన్సులు పొందాలని సూచించారు.
Sangareddy: వ్యాపారులు ఫుడ్ లైసెన్స్ పొందాలి: ఆహార భద్రతా శాఖ!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14-10-2026 బుధవారంరోజున నాడు నారాయణఖేడ్‌లో ఫుడ్ లైసెన్స్ మేళా నిర్వహించబడుతున్నది. ఈ మేళాలో ఆహార వ్యాపార నిర్వాహకులు (Food Business Operators – FBOs) తమ వ్యాపారాలకు సంబంధించి FSSAI ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడమైనది.
కావున నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, స్వీట్స్ షాపులు, చిరుతిళ్ల విక్రయ కేంద్రాలు, ఆహార తయారీదారులు మరియు ఇతర ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారులు కోరుతున్నారు. ఫుడ్ లైసెన్స్ మేళాకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా మరిన్ని వివరాల కోసం 9247926708 నంబర్‌ను సంప్రదించగలరు.




