Sangareddy: వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత: ఎమ్మెల్యే చింత ప్రభాకర్!

Sangareddy: సంగారెడ్డి 29వ వార్డు సిద్ధార్థ నగర్ కాలనీలో రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేసి నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.

SRIKANTH, SANGAREDY
Published on: 10 Nov 2026 4:45 PM IST
Sangareddy
X

Sangareddy: వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత: ఎమ్మెల్యే చింత ప్రభాకర్!

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తానని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు సిద్ధార్థ నగర్ కాలనీలో రూ.5 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రహదారుల నిర్మాణంతో ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గుతాయని, కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, నక్క నాగరాజు గౌడ్, కౌన్సిలర్ నవీన్, జాఫర్, సురేష్, మున్సిపల్ అధికారులు, కాలనీ పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY