Sangareddy: దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్!
Sangareddy: సంగారెడ్డిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నదానంలో భాగస్వామ్యం.
Sangareddy: దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్!
సంగారెడ్డి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్డు, శాంతినగర్ వద్ద కసిని చంద్రకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని శ్రీ జయదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కౌన్సిలర్ దశరథ్ రెడ్డి, జీవీ శ్రీనివాస్, విఠల్, మోహన్, చక్రపాణి, కసిని చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.




