Sangareddy: కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్!
Sangareddy: కార్తీకమాసం సందర్భంగా మాజీ కౌన్సిలర్ కసిని శ్రీకాంత్ నివాసంలో నిర్వహించిన రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.
Sangareddy: కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్!
Sangareddy: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ కసిని శ్రీకాంత్ నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన రుద్రాభిషేకం, రుద్ర హోమం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
కార్తీకమాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని, భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, లాడే మల్లేశం, మోహన్ నాయక్, రామాగౌడ్, చంద్రకాంత్, అజీమ్, దిలీప్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.




