Sangareddy: సంగారెడ్డిలో రూ.71.40 లక్షల గంజాయి పట్టివేత!
Sangareddy: సంగారెడ్డి కంది ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి రూ.71.40 లక్షల విలువైన 142.8 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు.
Sangareddy: సంగారెడ్డిలో రూ.71.40 లక్షల గంజాయి పట్టివేత!
సంగారెడ్డి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కంది ఎక్స్ రోడ్ వద్ద సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో 142.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.71.40 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, రెండు కార్లను సీజ్ చేశారు.
ఈ ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ వివరాలు వెల్లడిస్తూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.




