Sangareddy: పోతిరెడ్డిపల్లిలో తొలిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన!

Sangareddy: సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో తొలిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.

SRIKANTH, SANGAREDY
Published on: 13 Oct 2026 7:56 AM IST
Sangareddy
X

Sangareddy: పోతిరెడ్డిపల్లిలో తొలిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన!

Sangareddy: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా పొన్న రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY