Sangareddy: యువజన సమస్యలపై సమరశీల పోరాటాలు: డీవైఎఫ్ఐ!
Sangareddy: సంగారెడ్డిలో DYFI 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. విద్య, ఉపాధి, ఓటు హక్కు పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు సాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.
Sangareddy: యువజన సమస్యలపై సమరశీల పోరాటాలు: డీవైఎఫ్ఐ!
సంగారెడ్డి: డివైఎఫ్ఐ 47వ, ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో డివైఎఫ్ఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ బాబురావు లు మాట్లాడుతూ,1980లో దేశవ్యాప్తంగా యువతి యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరికీ విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం డివైఎఫ్ఐ యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
దేశవ్యాప్తంగా యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పైన సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం డివైఎఫ్ఐ అని కొనియాడారు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైన హక్కు అని అన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల పేర్లు తొలగించేందుకు అవకాశం కల్పించే ఏ ప్రక్రియనైనా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
SIR పేరుతో ఓటు హక్కును ప్రశ్నార్థకంగా మార్చే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. CEC జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియను పూర్తిగా నిలిపివేసి, ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ పారదర్శక విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఓటు హక్కు కోసం ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి రాకుండా ఎన్నికల సంఘం తన విధానాలను సరిదిద్దుకోవాలని, SIRను తక్షణమే నిలిపివేయాలి అన్నారు, అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కును రక్షించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో DYFI జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ జిల్లా సహాయ కార్యదర్శి మహేందర్ రెడ్డి నాయకులు చారి, లక్ష్మణ్, అర్జున్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.




