Sangareddy: వాల్మీకి జయంతి: నివాళులర్పించిన ఎస్పీ పరితోష్ పంకజ్!

Sangareddy: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాల్మీకి చిత్రపటానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 9:50 PM IST
Sangareddy
X

Sangareddy: వాల్మీకి జయంతి: నివాళులర్పించిన ఎస్పీ పరితోష్ పంకజ్!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆశ్వయుజ మాస పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని, సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవీయ విలువలను చాటిచెప్పారని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణం తరతరాలకు స్ఫూర్తినిస్తూ, సమాజానికి ధర్మమార్గాన్ని బోధిస్తోందని తెలిపారు.

మహర్షి వాల్మీకి బోధనలు మానవత్వం, నైతిక విలువలు, కర్తవ్యపాలన వంటి గొప్ప లక్షణాలను పెంపొందించుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ నీతి మార్గంలో నడవడమే మహర్షి వాల్మీకి కి మనం అందించే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, నగేష్, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్