Sangareddy: రాహుల్ సభకు సంగారెడ్డి నుంచి ఢిల్లీ పయనమైన కాంగ్రెస్!

Sangareddy: నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రాహుల్ గాంధీ సభకు సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బస్సులను ప్రారంభించారు.

Srinivas K, Sangareddy
Published on: 29 Oct 2026 7:35 PM IST
Sangareddy
X

Sangareddy: రాహుల్ సభకు సంగారెడ్డి నుంచి ఢిల్లీ పయనమైన కాంగ్రెస్!

సంగారెడ్డి: నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రాహుల్‌ గాంధీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో బయలుదేరారు. సంగారెడ్డి ఐబీ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు.

సదాశివపేట మండలం నుంచి సీడీసీ చైర్మన్‌ రామ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సిద్దన్న, శ్రీనివాస్‌ యాదవ్‌లతో కలిపి మొత్తం 46 మంది బయలుదేరారు. కొండాపూర్‌ మండలం నుంచి ఆత్మ చైర్మన్‌ ప్రభు, నాయకులు నర్సింహారెడ్డి, మల్లారెడ్డిలతో కలిపి 26 మంది ఢిల్లీ పయనమయ్యారు.

నిర్మల జగ్గారెడ్డి, భరత్‌ సాయిరెడ్డిలతో సహా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మొత్తం 150 మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరుకానున్నారు. బస్సుల ప్రారంభ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్‌ కిషన్‌, నాయకులు కూన సంతోష్‌, కిరణ్‌ గౌడ్‌, మహేష్‌ ముదిరాజ్‌, శ్రీహరి, సుదీప్‌, బబ్బు తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy