Sangareddy: కనీస వేతన జీవో 6ను తక్షణమే అమలు చేయాలి

Sangareddy: కనీస వేతన జీవో 6ను అమలు చేయాలని, కనీస వేతనం రూ.42,000 పెంచాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ధర్నా. అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 10:56 PM IST
Sangareddy
X

Sangareddy: కనీస వేతన జీవో 6ను తక్షణమే అమలు చేయాలి

సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవో 6 ను అమలు చెయ్యని పరిశ్రమ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, చట్టం ప్రకారం బోనస్ ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 42000/- పెంచాలని, కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు.

ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు, డిప్యూటీ లేబర్ కమిషనర్ (డీసీఎల్) యాదయ్య లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలను సవరిస్తూ జీవో నెం.6ను రాష్ట్ర ప్రభుత్వం 2026 మే30న నోటిఫికేషన్ విడుదల చేసిందని, పెరిగిన కనీస వేతనాలు జూన్ ఒకటో తేదీ నుండి అమలు చేయాలని జీవోలు పేర్కొన్నారని అన్నారు. జీవో వచ్చి నాలుగు నెలలైనా సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమల్లో నేటికీ జరిగిన కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు.

ఒకవేళ ఆలస్యంగా ఇచ్చినూ ఏరియర్స్ కట్టివాలని జీవోలో ఉందని అన్నారు. కనీస వేతనాలు ఈఎస్ఐపిఎఫ్ బోనస్ ఓటి సెలవులు వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా కార్మికులను శ్రమదోపిడికి యాజమాన్యాలు పాల్పడుతున్నాయని అన్నారు. కార్మిక చట్టాలు జీవోలను అమలు చేయించవలసిన కార్మిక శాఖ ప్రభుత్వ అధికార యంత్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు.

ప్రస్తుతం కనీస వేతనాలకు కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నా సరే జీవితంలో10 శాతం పెంచి ఇవ్వాలని జీవోలో ఉందని అన్నారు. కనీస వేతనాలను శాస్త్రీయంగా సవరించకపోగా ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించిందని అన్నారు. కుటుంబ అవసరాలు, జీవన వ్యయం, వినియోగదారుల ధరల సూచీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకో లేదని అన్నారు. కనీస వేతనాలను శాస్త్రీయంగా సవరించి రూ.42,000/- లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం 29కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ తెచ్చి కట్టు బానిసలుగా మారుస్తుందని అన్నారు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు జీవార్ ప్రకారం తక్షణమే అమలు చేయాలని చట్టం ప్రకారం బోనస్ ఇవ్వాలని కనీస వేతనం 42,000 పెంచాలని లేబర్ కోర్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులను సంఘటితం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.

అక్టోబర్ 25 26 తేదీల్లో హైదరాబాద్ లో మల్టిపుల్ డేస్ ధర్నా నిర్వహించడం జరుగుతుందని అక్టోబర్ 25న పారిశ్రామిక కార్మికులతో జరిగే మహాధర్న లో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కే.రాజయ్య జిల్లా ఉపాధ్యక్షులు వి. ప్రవీణ్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్.మల్లేష్ ఎన్.రాజు మోహన్ రెడ్డి శంకర్ బిలాల్ సుధాకర్ రెడ్డి సంతోష్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు వివిధ పరిశ్రమల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్