Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు దసరా శుభాకాంక్షలు

Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల దసరా శుభాకాంక్షలు. జమ్మి ఆకులు అందజేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న శ్రేణులు.

SRIKANTH, SANGAREDY
Published on: 21 Oct 2026 5:08 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు దసరా శుభాకాంక్షలు

సంగారెడ్డి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన నాయకులు, కార్యకర్తలు జమ్మి ఆకులు అందజేసి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆత్మీయంగా మమేకమయ్యారు. జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేకమైన భాగం.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని, ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడమే కాకుండా ప్రజల మధ్య ప్రేమాభిమానాలను, ఆత్మీయతను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SRIKANTH, SANGAREDY

SRIKANTH, SANGAREDY