Patancheru: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు

Patancheru: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలను రామచంద్రపురంలో కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Nov 2026 10:34 PM IST
Patancheru
X

Patancheru: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు

సంగారెడ్డి జిల్లా: పటాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలను తన నివాసంలో జిల్లా బీజేపీ నాయకులు కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వందలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి గోదావరి అంజిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ సందర్భంగా కొల్కూరి రాజశేఖర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి స్థానిక పంచముఖి హనుమాన్ దేవాలయంలో గోదావరి అంజిరెడ్డి పేరున ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

​అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఆ పరమశివుని ఆశీస్సులతో గోదావరి అంజిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పార్టీ శ్రేణులు, అభిమానుల తరఫున ఆకాంక్షించారు. తన నాయకత్వంలో జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, రానున్న జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో నాగులపల్లి మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్,జె పి కాలనీ డివిజన్ శివ, బీజేవైఎం నాయకులు ప్రసాద్ యాదవ్,పలువురు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్