Sangareddy: నవంబర్ 15న లక్ష మందితో రైతు బహిరంగ సభ: రైతు సంఘం!
Sangareddy: నల్లగొండలో జరిగే AIKS 36వ అఖిల భారత రైతు మహాసభలను విజయవంతం చేయాలని సంగారెడ్డి సుందరయ్య భవన్‌లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు పిలుపునిచ్చారు.
Sangareddy: నవంబర్ 15న లక్ష మందితో రైతు బహిరంగ సభ: రైతు సంఘం!
సంగారెడ్డి: అఖిల భారత కిసాన్ సభ 36వ రైతుమహాసభలను జయప్రదం చేయండి. రైతు సంగం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు. సంగారెడ్డిలో. AIKS కరపత్రం విడుదల నవంబర్ 15 నుండి 18 వరకు నల్గొండ లో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంగం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు పిలుపు నిచ్చారు.
ఈరోజు సంగారెడ్డి లో సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు సంగం మహాసభల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జయరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న భూమి, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, మద్దత్తు ధరల సమస్యలపై చర్చించడం కోసం ఈనెల 15 తేదీ నుండి 18వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలోఅఖిల భారత కిసాన్ సభ 36వ రైతు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ యొక్కమహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మందిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు.15వ తేదీ జరిగే లక్ష మంది తోటి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ బహిరంగ సభను రైతులందరూ. పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించడం లేదు.
ఎరువులు, విత్తనాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని విద్యుత్ ప్రైవేటీకరణచేస్తున్నారని కరువుతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదని ఆయన అన్నారు. మహాసభలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్తు ఉద్యమ ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.
రైతు సంక్షేమం కోసం జరిగే ఈ యొక్క అఖిలభారత మహాసభలను రైతులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి యస్.రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజయ్య,నాయకులు రాములు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.




