Toopran: బ్రాహ్మణపల్లి, పడాలపల్లి మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలి
Toopran: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి, పడాలపల్లి గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్, నర్సారెడ్డిలకు వినతిపత్రం ఇచ్చారు.
Toopran: బ్రాహ్మణపల్లి, పడాలపల్లి మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలి
తూప్రాన్: తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బ్రాహ్మణపల్లి, 11వ వార్డు పడాలపల్లి గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఈ మేరకు గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మెదక్ జిల్లా ఇంఛార్జ్ గడ్డం వివేక్ వెంకటస్వామి, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.
నాగులపల్లి మీదుగా వెల్దుర్తి వెళ్లే బస్సులను తూప్రాన్ - బ్రాహ్మణపల్లి - పడాలపల్లి మీదుగా నడిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాము ప్రతినిత్యం నిత్యవసరాల కోసం, విద్యాభ్యాసం, వ్యాపారం, కూలి పనుల నిమిత్తం తూప్రాన్ మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అయితే బ్రాహ్మణపల్లి, పడాలపల్లి నుండి తూప్రాన్ వరకు ఆటో వాళ్లు విపరీతమైన చార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆటో వాళ్లు అధిక చార్జీలు చెల్లిస్తేనే ఎక్కనిస్తున్నారని వాపోయారు.
కావున నిరుపేద ప్రజల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుని తమ గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు నడిపించి ఆదుకోవాలని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ వార్డు, 11వ వార్డు గ్రామ ప్రజలు వినతి చేశారు.




