Toopran: ఘణాపూర్ సాయినాథ్ ఇండస్ట్రీస్‌లో రూ.9 కోట్ల వరి ధాన్యం మాయం!

Toopran: తూప్రాన్ మండలం ఘణాపూర్ సాయినాథ్ ఇండస్ట్రీస్‌లో రూ.9 కోట్ల విలువైన 3,620 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాయమైనట్లు అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది.

RAJU,TOOPRAN
Published on: 1 Nov 2026 8:16 AM IST
Toopran
X

Toopran: ఘణాపూర్ సాయినాథ్ ఇండస్ట్రీస్‌లో రూ.9 కోట్ల వరి ధాన్యం మాయం!

Toopran: తూప్రాన్ మండలం ఘణాపూర్ గ్రామంలోని సాయినాథ్ ఇండస్ట్రీస్‌లో భారీ వరి ధాన్యం మాయం వెలుగుచూసింది.

అక్టోబర్ 30న సివిల్ సప్లైస్ మరియు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 3,620 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మెదక్ సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.ఈ దాడి లో తూప్రాన్ ఎసైలు గంగరాజు యాదగిరి రెవిన్యూ ఇన్సపేక్టర్ ప్రేమ్ కుమార్ సివిల్ సప్లై నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN