Sangareddy: సంగారెడ్డి అక్షర స్కూల్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం!
Sangareddy: సంగారెడ్డి మల్కాపూర్ అక్షర స్కూల్‌లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ సీఐ రామకృష్ణ రెడ్డి విద్యార్థులకు సూచనలు చేశారు.
Sangareddy: సంగారెడ్డి అక్షర స్కూల్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం!
Sangareddy: రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం శనివారం అక్షర స్కూల్, మల్కాపూర్ లో ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులలో మరియు ప్రజలలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సంగారెడ్డి ట్రాఫిక్ ci శ్రీ రామకృష్ణ రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... చాలా రోడ్డు ప్రమాదాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం మరియు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ పోలీసు అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యత, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు వివరించారు. రోడ్డును సురక్షితంగా ఎలా దాటాలి, ప్రమాద బాధితులకు ఎలా సహాయం చేయాలి అనే విషయాలను కూడా తెలియజేశారు. "హెల్మెట్ పెట్టుకో, ప్రాణం కాపాడుకో", "మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు", "వేగం ప్రాణాంతకం" అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ T.రాజయ్య గారు, ci రామకృష్ణ రెడ్డి గారు.
ట్రాఫిక్ SI రాములు గారు,SI సాయిలు గారు, SI గోప్యా నాయక్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,పోలీసు అధికారులు పాల్గొన్నారు. చివరగా పాల్గొన్న వారందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.




