Ramayampet: రామాయంపేటలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం!

Ramayampet: ఆదిలాబాద్ రైతు గర్జనకు వెళ్తున్న కేటీఆర్‌కు రామాయంపేటలో ఘన స్వాగతం పలికిన మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి.

RAJU,TOOPRAN
Published on: 1 Nov 2026 1:06 PM IST
Ramayampet
X

Ramayampet: రామాయంపేటలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం!

Ramayampet: రామాయంపేటలో KTR కు ఘన స్వాగతం పలికిన మెదక్ జిల్లా BRS అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి* BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదిలాబాద్ రైతు గర్జన సభకు వెళ్తున్న సందర్భంగా రామాయంపేటలో మెదక్ జిల్లా BRS అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

జాతీయ రహదారిపై KTR కాన్వాయ్ కు గుమ్మడికాయ కొట్టి, పుష్పగుచ్ఛం అందజేసి శాలువ వేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ లో జరుగుతున్న రైతు గర్జనకు వెళ్తున్న KTR గారికి మెదక్ జిల్లా తరపున ఘన స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు BRS పార్టీ రైతు గర్జన చేపడుతోంది. KTR గారి నాయకత్వంలో ఈ సభ విజయవంతం అవుతుంది. రైతుల పక్షాన BRS ఎప్పుడూ పోరాటం చేస్తుందని"ఆమె అన్నారు.

అనంతరం జై తెలంగాణ, జై KCR, జై KTR నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ నర్సింగ్ సర్పంచ్ మల్లేష్ గౌడ్ రామాయంపేట మండల BRS నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN