Ramachandrapuram: 24 గంటల్లో రూ.10 లక్షల చోరీ కేసు ఛేదన

Ramachandrapuram: రామచంద్రాపురంలో బస్సులో రూ.10 లక్షల చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్, రూ.9.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడి.

Ramachandrapuram
X

Ramachandrapuram: 24 గంటల్లో రూ.10 లక్షల చోరీ కేసు ఛేదన

రామచంద్రపురం: రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ కు చెందిన వ్యాపారస్తుడు వెంకటరమణ గుల్బర్గాలోని ఎస్బిఐ బ్యాంకు నుంచి నగదు, నాణేలను తీసుకొని ఆర్టీసీ బస్సులో లింగంపల్లి వద్ద బస్సు దిగి చూడగ డబ్బుల బ్యాగు కనిపించకపోవడంతో డబ్బుల బ్యాగు చోరీ అయినట్లు గుర్తించారు.

బాధితుడు వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపగ అట్టి బ్యాగును గుల్బర్గాకు చెందిన ఉమేష్ చావన్ చోరీ చేసినట్లుగ గుర్తించారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుడు ఉమేష్ చావాను అరెస్టు చేసి అతని వద్ద నుండి 9.50 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపిన ఏసీపి శ్రీనివాస్.

ప్రజలు బస్సులు ఇతర ప్రజారవాణా వాహనలో ప్రయాణించే సమయంలో నగదు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

24 గంటల్లో కేసులు చేదించిన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది పనితీరును సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శేర్లింగంపల్లి డిసిపి అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్