Patancheru: మహంకాళి ఆలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూజలు!
Patancheru: పటాన్చెరు శ్రీ మహంకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.
Patancheru: మహంకాళి ఆలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూజలు!
Patancheru: శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం పటాన్చెరు పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రకాష్ రావు, చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, మాణిక్ ప్రభు, మల్లేష్, వినోద్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.




